మహిళాదినోత్సవం సందర్భంగా కే టి ఆర్ సమక్షంలో…మహిళలను సత్కరించుకున్నడా|| హరిణి బోయినిపల్లి

womens day by prathima foundation

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళలను సత్కరించుకొంటు, ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిమ క్యాన్సర్  ఇన్స్టిట్యూట్ యొక్క సహకారంతో మహిళలందరికీ ఉచితంగా మెగా హెల్త్ క్యాంపు మరియు  క్యాన్సర్  స్క్రీనింగ్ శిబిరం 8వ, 9వ, మరియు 10వ  తేదీలల్లో వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం , ఏనుగల్లులో మూడు రోజులు ఏకధాటిగా, గ్రామీణ మహిళామణులకు సేవలందించినట్లుగా ప్రతిమ ఫౌండేషన్ మెంబర్ హరిణి గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కే.టీ . రామా రావు గారి చేతుల మీదుగా ప్రారంభించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,  రాష్ట్ర ప్రణాళిక  సంఘ  అధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, స్థానిక MLA  ఆరూరి రమేష్ గారు మరియు మిగిలిన పంచాయతీ సభ్యలు, లోకల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  మంత్రివర్యులు శ్రీ కే.టీ . రామా రావు గారు మాట్లాడుతూ, పుట్టిన గడ్డకు ఋణం తీర్చుకోవాలనే గొప్ప గుణంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు మరియు  క్యాన్సర్  స్క్రీనింగ్ శిబిరం నిర్వహించిన బోయినపల్లి శ్రీనివాస్ గారికి, బోయినపల్లి హరిణి గారికి , మరియు వారి కుటుంబ సభ్యలందరికి  అభినందనలను తెలియపరిచారు.

దీనికి కొనసాగింపుగా మూడు రోజుల ఉచిత మెగా హెల్త్ క్యాంపు మరియు  క్యాన్సర్  స్క్రీనింగ్ శిబిరంముగింపు కార్యకక్రమంలో “డాక్టర్  ప్రతిక్  బోయిన పల్లి” గారు , డైరెక్టర్ ప్రతిమ గ్రూప్ అఫ్ హాస్పిటల్స్, అండ్  ఫౌండేషన్ మెంబెర్, మాట్లాడుతూ మన కే.టీ.ఆర్  గారు ప్రారంభించిన ఈ  మూడు రోజుల కార్యక్రమంలో,  ప్రతి రోజు దాదాపుగా  1000 మందికి పైగా పెద్ద ఎత్తున పాల్గొని, ఉచిత మెగా హెల్త్ క్యాంపు మరియు  క్యాన్సర్  స్క్రీనింగ్ సేవలను ఉపోయోగించుకున్నారని తెలిపారు. ఏనుగల్లు చుట్టుపక్కల గ్రామాలు, మరియు తాండాల నుండి మహిళామణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు.