Prathima Foundation – Health Awareness Program for women & Free Sanitary Pads Distribution

Another Major initiative by Prathima Foundation is “Women & Girls – Health awareness Program and Free Sanitary Pads Distribution” at Chandurthi Village & Mandal, Rajanna Sircilla District on 6th August 2021.

అతివకు అందుబాటులో ఆరోగ్యం అనే లక్ష్యం తో ఉత్తర తెలంగాణ గ్రామీణ  ప్రాంత మహిళలు మరియు యుక్త వయసు బాలికలు(కిశోర బాలికలకు ) అందరకి ప్రతిమ ఫౌండేషన్ మరియు ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ నగునూర్,కరీంనగర్ వారి సహకారం తో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని చందుర్తి మండలం , చందుర్తి గ్రామ పంచాయతీ  మరియు చుట్టుపక్కల గ్రామాలు అయిన  రామన్నపేట, తిమ్మాపూర్, ఆశిరెడ్డి పల్లి , అనంత పల్లి, నర్సింగ పూర్  గ్రామీణ మహిళల ఆరోగ్య సంరక్షణ మరియు సమతుల్య పోషణ గురించి  వివరాలు అందించడం కోసం అనుభవజ్ఞులైన గైనకాలజి ( స్త్రీ వైద్య నిపుణులు) డాక్టర్ల సలహాలు,సూచనలు మరియు  సేవలను ఉచితంగా ప్రతిగ్రామంలో  మహిళల కీ   అందుబాటులోకి తేవాలనే గొప్ప ఆలోచనతో ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సులు యుక్త వయసులో వచ్చే సాదారణ ఆరోగ్య సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు గల కారణాలు,   ఎలా  గుర్తించడం మరియు   తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై  ఆవగాహన కల్పించడం తో పాటు ,గర్భిణీ స్త్రీలకు, రొమ్ము గడ్డలు,ఋతుక్రమం ఆగిపోవుట (మోనోపాజ్) లక్షణాలు,మోనోపాజ్  దశలో  పడే ఇబ్బందులు మరియు మహిళలో  వచ్చే రొమ్ము క్యాన్సర్,  , సర్వీకల్  క్యాన్సర్ ని ముందస్తుగా గుర్తించే  మమ్మోగ్రఫీ, పాప్ స్మియర్ పరీక్షలు అవసరమైన వారికి ఉచితంగా నిర్వహించడం తో పాటు   వారి వ్యక్తి గత ఆరోగ్య  పరిరక్షనే    ఈ   సదస్సు  యొక్క   ముఖ్య   ఉద్దేశం.

గ్రామీణ మహిళలు యుక్త వయసు బలికలు ఎదుర్కొంటున్నా  ఆరోగ్య  సమస్యలు గుర్తించి డాక్టర్  చెన్నమనేని వికాస్ గారు ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ   బోయినిపల్లి శ్రీనివాస్ రావు గారి ద్రుష్టి కి తీసుకెళ్లగా  వెంటనే స్పందించి. మహిళల ఆరోగ్యం పై అవగాహన సదస్సు కు ఉచిత సానిటరీ ప్యాడ్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

 ఇపుడున్న   ఆధునిక కాలం లో సైతం  గ్రామిణ ప్రాంత స్త్రీ లకు సానిటరీ ప్యాడ్స్ పై అవగాహన లేకపోవడం మరియు ఉపయోగ ప్రయోజనలు తెలియజేయడం కొరకు ఈ కార్యక్రమం లో బాగంగా ఉచిత సానిటరీ ప్యాడ్స్  ప్రతి మహిళకి 3 నెలలకి సరిపడ ప్యాడ్స్ ని పంపిణీ చేయడం జరుగుతుంది.

  ఇదే కాకుండా  ఆరోగ్యం మీ ముంగిట్లో అనే నినాదంతో    గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా స్థోమత లేని బీద, బడుగు, బలహీన వర్గలా వారికి అత్యున్నత  వైద్యసేవలు మరియు అత్యాధునికధునిక డయాగ్నోస్టిక్ సేవలను వారి గ్రామంలోనే అందించే విధంగా పని చేయటం ఈ ప్రతిమ సంచార ఆరోగ్య రథం ముఖ్య ఉద్దేశం.  ప్రతిమ సంచార ఆరోగ్య రథం అందించే వైద్య సేవలు:    ఎక్స్ – రే, ఎలక్ట్రో కార్దియోగ్రామ్, కార్దియాక్ ప్రొఫైల్, మమ్మోగ్రఫీ, మినీ లాబొరేటరీ సదుపాయలు కలవు.